ధనస్సురాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

by Satheesh |   ( Updated:2023-10-10 11:04:21.0  )
ధనస్సురాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..
X

మూల 1,2,3,4 (యే,యో,బా,బీ) పూ.షా 1,2,3,4(బూ, ధాభా,ఢా), ఉ.షా1(బే)

ఆదాయం 2

వ్యయం 8

రాజపూజ్యం 6

అవమానం1

ఈ రాశికి గురువు 13.04.2022 వరకు తృతీయమున రజతమూర్తిగా తదుపరి చతుర్థమునరజతమూర్తిగా గోచరించును. ద్వితీయంలో శని 29.04.2022 వరకు రజతమూర్తిగా, తరువాత 12. 07.2022 వరకు లోహమూర్తిగా తృతీయములో అప్పటి నుంచి 17.01.2023 వరకు మర ద్వితీయంలో సువర్ణమూర్తిగాను, తదుపరి తృతీయమందు లోహమూర్తిగాను గోచరించును. రాహువు పంచమంలో, కేతువు ఏకాదశంలో రజతమూర్తులుగా గోచరిస్తారు. ఆస్తులు మార్పిడి చేసే అవకాశం గలదు. భూవ్యాపారాలు కొంతవరకు లాభిస్తాయి. మధ్యవర్తత్వాలు, వధ్యవర్తి ప్రయత్నాలు సఫలమవుతాయి. సంప్రదాయ విషయాలపై ఆసక్తి, శ్రద్ధ చూపిస్తారు. వ్యాపారాన్ని సొంతంగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార భాగస్వాములను దూరంగా ఉంచాలని ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ పరపతి ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పడుతాయి.

మీకంటూ ఒక వర్గాన్ని స్థిరపర్చుకుంటారు. నూతన భవన నిర్మాణానికి బ్యాంకు రుణాలకై ప్రయత్నాలు చేస్తారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. శక్తికి మించిన కార్యాలు చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. పేరు ప్రతిష్ఠలకు లోపం ఉండదు. దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ప్రతిష్ఠలకు లోటు ఉండదు. రాజకీయాంగా ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల మీకు విశేషంగా సహకారం లభించవచ్చును. కండరాలు, కీళ్ల నొప్పులు, అవస్థలు మాత్రం భరించక తప్పదు. బీపీ, షుగర్ వంటి వ్యాధుల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ అజాగ్రత్త పనికిరాదు. నూతన విద్యలపై ఆసక్తి చూపిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. సమాజంలో గతంలో నష్టపోయిన పరపతిని ప్రతిష్టను తిరిగి పొందుతారు.

ఎవరైతే గతంలో అవమాన పరిచారో వారు నిజం తెలుసుకొని పశ్చాత్తాప పడతారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసికంగా ఆనందంచే చక్కని స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. దాంపత్య సౌఖ్యం ఏర్పడుతుంది. గతంలో ఉన్న అపోహలు, అవమానాలు సమసిపోతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ఉన్న ఆదాయానికి మరొక ఆదాయం తోడవుతుంది. తెలివితో చాకచక్యంతో శత్రువులపై ఆధిపత్యాన్ని సాధిస్తారు. వారు తీసుకున్న గోతిలో వారే పడేలా ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు. అవివాహితులకు చక్కని వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారి పరిచయాలు ఏర్పడుతాయి.

మీకు ఉన్నత గౌరవం దక్కుతుంది. విలువైన, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అనేక రకాలైన కొత్త మార్గాలను అవలంబించి వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. సమాజంలో ముఖ్యమైన అవసరమైన కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నత స్థాయి ప్రశంసలు పొందుతారు. అదనపు బాధ్యతలను నిర్వహించవలసి వస్తుంది. పని తీవ్రత, ఒత్తడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. నూతన వాహనాలు సమకూర్చుకుంటారు. చరాస్తులు వృద్ధి పర్చుకుంటారు. ప్రేమ వివాహాలు సఫలం కావచ్చును. నూతనంగా వ్యాపార పరంగా భూములపై, బంగారంపై లేదా షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతారు.

తమ సంతానానికి వారి భవిష్యత్తుకై పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తారు. శత్రువులు స్తబ్ధులై ఉంటారు. సుఖ సైఖక్యాలు పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు. జీవిత భాగస్వామితో చక్కని అనురాగ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. శయ్యాసౌఖ్యం లభిస్తుంది. జనాకర్షణ పెరుగుతుంది. ప్రభుత్వ పరంగా మీకు అందవలసిన ప్రయోజనాలు అందుకుంటారు. రాజకీయ లబ్ధి పరపతి పొందుతారు. రాజకీయ లబ్ధి పరపతి ఏర్పడుతుంది. నూతన గృహ నిర్మాణానికి మీరు చేయు కృషి ఫలిస్తుంది. మీ వృత్తికి తగిన మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు చక్కని అవకాశాలు లభిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉన్నది.

పంచాంగకర్త

జ్యోతిష విశారద, జ్యోతిష ప్రవీణ

దైవజ్ఞ డాక్టర్ కొదుమగుళ్ల వేణుగోపాలాచార్య సిద్ధాంతి

M.A(Astro), Ph.D

హనుమత్ జ్యోతిషాలయం, కూచవరం గ్రామం, తూప్రాన్ మండలం, మెదక్ జిల్లా

Advertisement

Next Story