Viswam : విశ్వం మూవీ మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే..?

by Prasanna |
Viswam : విశ్వం మూవీ  మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీను వైట్ల (Srinu Vaitla) , గోపీచంద్ (Gopichand) కాంబోలో తెరకెక్కిన సినిమా ‘విశ్వం’ (Viswam) . ఆరేళ్ళు గ్యాప్ తీసుకుని శ్రీను వైట్ల మంచి కథతో వచ్చాడు. నెగిటివ్ రివ్యూలను పక్కన పెడితే సినిమాకి అన్ని చోట్లా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో కావ్య థాపర్ (Kavya Thapar) కథానాయికగా నటించింది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’, ‘చిత్రాలయం స్టూడియోస్’ సంయుక్తంగా కలిసి ఈ సినిమాని నిర్మించారు. రిలీజ్ కు ముందు టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల11న ఈ సినిమా ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఒకసారి మొదటి వీకెండ్ కలెక్షన్స్ ని ఇక్కడ చూద్దాం..

నైజాం - 01.18 CR

సీడెడ్ - 0.49 CR

ఉత్తరాంధ్ర - 0.54 CR

ఈస్ట్ - 0.11 CR

వెస్ట్ - 0.16 CR

గుంటూరు - 0.42 CR

కృష్ణా - 0.45 CR

నెల్లూరు - 0.15 CR

ఏపీ + తెలంగాణ (టోటల్) - 03.60 CR

రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.29 CR

ఓవర్సీస్ - 0.27 CR

వరల్డ్ వైడ్ టోటల్ - 04.16 CR

'విశ్వం’ మూవీకి రూ.12.5 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.4.16 కోట్లను వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా మరో రూ.8.84 కోట్లను కలెక్ట్ చేయాలి.

Next Story