Lucky Baskhar : ‘లక్కీ భాస్కర్’ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే.. దుల్కర్ కల నెరవేరుతుందా..?

by Prasanna |   ( Updated:2024-11-02 15:17:19.0  )
Lucky Baskhar : ‘లక్కీ భాస్కర్’ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే.. దుల్కర్ కల నెరవేరుతుందా..?
X

దిశ, వెబ్ డెస్క్ : దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి జంటగా హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ దీపావళి రోజున థియెటర్లో విడుదలైంది. సినిమా మీద నమ్మకంతో ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు షో లు వేశారు.

అయితే, మొదటి షో నుంచే లక్కీ భాస్కర్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించారు. బ్యాంక్ లో పని చేసే ఒక ఎంప్లాయ్ కోట్లు ఎలా సంపాదించాడనేడి ఈ సినిమా కథ. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 12 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించగా.. రెండు రోజుల్లో 26.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలాగే కొనసాగితే నాలుగు రోజుల్లో లక్కీ భాస్కర్ సినిమా రూ. 50 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. అయితే, సినిమా విడుదలకు ముందు దుల్కర్ ఓ ఇంటర్వ్యూలో రూ.100 కోట్ల కలెక్షన్ అనేది నా కల అని అన్నారు. సూపర్ హిట్ అయిన సీతారామం మూవీ రూ. 96 కోట్లు కలెక్ట్ చేసింది. మరి, ఈ లక్కీ భాస్కర్ మూవీతో దుల్కర్ రూ. 100 కోట్ల కల తీరుతుందో? లేదో? చూడాల్సి ఉంది.

Read More ..

Dulquer Salman: 16 ఏళ్లకే అమ్మాయితో ఆ పని చేసిన స్టార్ హీరో.. మామూలోడు కాదుగా అంటున్న నెటిజన్లు

Advertisement

Next Story