FLASH: ఎన్ని సీట్లు గెలుస్తారో తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్

by GSrikanth |   ( Updated:2022-03-21 12:58:33.0  )
FLASH: ఎన్ని సీట్లు గెలుస్తారో తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ భవన్ వేదికగా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ అవగాహన లేనివాళ్లు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంపై యుద్ధం చేయడానికే ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై 30 నియోజకవర్గాల్లో సర్వే చేస్తే 29 నియోజకవర్గాల్లో తామే గెలుస్తున్నట్లు సర్వే వర్గాలు తేల్చి చెప్పాయని అన్నారు. ఆ ఓడిపోయే ఒక్క స్థానంలో కూడా 0.3 తేడాతో ఓటమి చెందాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.





Advertisement

Next Story