విద్యాశాఖ మంత్రి సొంత జిల్లాలో.. రోడ్డెక్కిన హాస్టల్ విద్యార్థులు

by Vinod kumar |
విద్యాశాఖ మంత్రి సొంత జిల్లాలో.. రోడ్డెక్కిన హాస్టల్ విద్యార్థులు
X

దిశ, యాచారం: మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఇలా ఉందంటే ఆశ్చర్యం కలిగిస్తోంది. నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య అందించాలననేది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం కాగా నాణ్యమైన భోజనం అందించడం లేదని , తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక విద్యార్థులు ఆదివారం సాగర్ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులు మాట్లాడుతూ.. హాస్టల్ లో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. నాణ్యమైన భోజనం అందివ్వడం లేదని విద్యార్థులు వాపోయారు.


మరుగు దొడ్ల సౌకర్యం లేక బయటకు పోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయూడు కానీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం హాస్టల్ లో వైద్య సిబ్బంది లేరని అన్నారు. భోజనం సరిగా లేకపోవడంతో పాటు.. నాసిరకం బియ్యం రాళ్లు కూడా వస్తున్నాయని అన్నారు. దీంతో విషయం తెలుసుకున్న మండల ఎంపీపీ కొప్పు సుకన్య హాస్టల్ ను సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, హాస్టల్ లోని వంటశాలను పరిశీలించారు. అనంతరం ఎంపీపీ కొప్పు సుకన్య స్పందిస్తూ.. సరి అయిన భోజనం అందివ్వడం లేదని గుర్తుంచామని అన్నారు. విద్యార్థుల సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని, సమస్య పరిష్కారానికై కృషి చేస్తానని ఎంపీపీ సూచించారు.

Advertisement

Next Story