Salaar-2: గెట్ రెడీ బాయ్స్.. సలార్-2 పై మరో అప్‌డేట్ ఇచ్చిన హోంబలే ఫిలిమ్స్

by sudharani |
Salaar-2: గెట్ రెడీ బాయ్స్.. సలార్-2 పై మరో అప్‌డేట్ ఇచ్చిన హోంబలే ఫిలిమ్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘సలార్’ (Salaar) ఎలాంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేజీఎఫ్ (KGF) ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటించగా.. మలయాళ (Malayalam) స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ (Pridhviraj Sukumaran) కీలక పాత్రలో కనిపించాడు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ రాబట్టి సూపర్ సక్సెస్ అయింది. అయితే.. ఈ చిత్రం ఎండింగ్‌లో ‘సలార్’కు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ.. అప్పటి నుంచి ఒక్క అప్‌డేట్ కూడా రాకపోవడంతో సలార్-2 లేదు అని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్‌కు చెక్ పెడుతూ.. తాజాగా హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. సలార్-2తో పాటు ప్రభాస్ మరో రెండు ప్రాజెక్టులు ఈ బ్యానర్‌లో చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. అంతే కాకుండా.. #Salaar2తో ప్రయాణం ప్రారంభమవుతుంది అంటూ హింట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు అదే విషయాన్ని అనౌన్స్ చేస్తూ.. సలార్-2 (Salaar-2) కు సంబంధించిన చిన్న వీడియో గ్లింప్‌ను రిలీజ్ చేస్తూ.. ‘ప్రయాణం అద్భుతంగా సాగుతుంది... #Salaar2 ప్రారంభం!’ అపే క్యాప్షన్ జత చేసింది. ప్రజెంట్ ఈ ట్వీట్ వైరల్ కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందంతో నెట్టింట పోస్టులు షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story