'నగ్నంగా ఫొటోలు పంపాలని అడిగారు'.. అంకిత్ శివాచ్

by Satheesh |   ( Updated:2022-04-09 16:59:23.0  )
నగ్నంగా ఫొటోలు పంపాలని అడిగారు.. అంకిత్ శివాచ్
X

దిశ, వెబ్‌డెస్క్: హిందీ నటుడు, మోడల్ అంకిత్ శివాచ్ తాజాగా కాస్టింగ్ కౌచ్‌పై స్పందించాడు. 12 ఏళ్ల క్రితం ఢిల్లీలో మోడలింగ్ ప్రారంభించిన శివాచ్‌.. కెరీర్‌లో తాను ఎదుర్కొన్న సమస్యలను గుర్తుచేసుకున్నాడు. 'కెరీర్ ప్రారంభంలో కొందరు నన్ను బట్టలు లేకుండా నగ్న చిత్రాలు పంపాలని అడిగారు. అంతేకాకుండా నా పనితో సంబంధం లేని పార్టీలకు రావాలని వేధింపులకు గురి చేశారు. మోడలింగ్ సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను.. కొన్ని సమయాల్లో మోడలింగ్‌ను వదిలేయాలనిపించింది. అధికారంలో ఉన్నవారు ఇతరులను దోపిడీ చేయడం మానవ స్వభావం అని నేను భావిస్తున్నాను. ఇది ప్రతి పరిశ్రమలో ఉంటుంది. మీరు వారిని తప్పించుకోలేరు' అని శివాచ్ అభిప్రాయపడ్డాడు.

Advertisement

Next Story