- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఫోన్ పేరుతో హైటెక్ మోసం.. రూ.21వేలు ఫోన్ పే చేసిన బాధితుడు
దిశ, భిక్కనూరు : సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ పదే పదే సూచిస్తున్నప్పటికీ అత్యాశకు పోయి మోసపోతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన సుంకరి సాగర్ గత నెల 25వ తేదీన తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టులు చూస్తుండగా, ఐఫోన్ 12 మోడల్ మొబైల్ ఫోన్ ఆఫర్ కనిపించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పోస్టులో ఉన్న మొబైల్ నెంబర్‌కు ఫోన్ కావాలని మెసేజ్ పంపాడు.
గుర్తుతెలియని వ్యక్తి తన వాట్సాప్ కి ఆడియో కాల్ చేసి క్రెడిట్ కార్డు చార్జెస్ రూ. 21వేలు పంపినట్లయితే ఐఫోన్ 12 మోడల్ పంపిస్తామని చెప్పాడు. యూపీఐ ఐడి నెంబర్‌కు రూ. 21 వేలు గత నెల 26వ తేదీన తన ఫోన్ ద్వారా ఫోన్ పే చేశాడు. ఫోన్ పే చేసిన తర్వాత తన నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టడంతో వేరే నెంబర్‌తో కాల్ చేయగా రాంగ్ నెంబర్ అని మాట వచ్చింది. అప్పుడే తాను మోసపోయానన్న విషయాన్ని గ్రహించి ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేసినట్లు భిక్కనూరు ఎస్ఐ ఆనంద్ గౌడ్ వివరించారు.