- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన హీరోయిన్.. నెల తర్వాత ఫొటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)తో ఎక్కువ సినిమాలు చేసిన నిర్మాత నట్టి కుమార్(Natti Kumar) మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఆయన కూతురు నట్టి కరుణ(Natti Karuna) కూడా ‘దెయ్యంతో సహజీవనం’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. అలాగే సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు పెట్టి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే నట్టి కరుణ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. నిఖిల్ గూడిరి(Nikhil Gudiri) అనే ఫిట్నెస్ ట్రైనర్‌ను వివాహం చేసుకుంది. నిఖిల్ ఫిట్నెస్ ట్రైనర్‌గా, న్యూట్రీషియన్‌గా కూడా వర్క్ చేస్తున్నాడు.
అయితే వీరి పెళ్లి విషయం బయట పడకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా, హీరోయిన్ కరుణ (Natti Karuna)తనకు పెళ్లి జరిగి నెల రోజులు పూర్తి అయ్యాయని తెలుపుతూ వన్ మంత్ యానివర్సరీ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా.. ‘‘థాంక్యూ అమ్మా నాన్న అత్తయ్య మామయ్య ఎల్లప్పుడూ మాకు సపోర్ట్ చేస్తూ మీ ఆశీస్సులు అందిస్తున్నందుకు. మా పెళ్లిని ఇంత అందంగా, ఆనందంగా చేసినందుకు మా ప్రియమైన వారందరికీ ధన్యవాదాలు. బుజ్జూ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.
మీరు నాకు అందించిన ప్రేమ చాలా గొప్పది. 1 మంత్ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇంకా చాలా నెలలు, సంవత్సరాలు ప్రేమతో పాటు సరదా పోరాటాలు, అర్థం చేసుకోవడం, మిస్ అండర్స్టాండింగ్స్, ట్రిప్స్, అడ్వెంచర్స్ చేయాలనుకుంటున్నా. క్విటీ బుజ్జి మేము నిన్ను మిస్ అవుతున్నాము కానీ మీరు ఎల్లప్పుడూ మాతో ఉంటారని నాకు తెలుసు నువ్వు లేకుండా నేను లేను’’ అనే క్యాప్షన్ జత చేసింది. అలాగే ఎంగేజ్‌మెంట్ పిక్స్, పెళ్లి వీడియోను షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్‌కు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.