- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ananya: ‘కన్నీటితో నిండిన కళ్లు నాకు సహజమైన అందాన్నిస్తాయి’.. కుర్ర హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. ప్రజెంట్ ఈ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాధారణంగా ఎవరైనా ఏడవడం కాదు.. ఏడుపు ముఖం పెడితేనే ఫేస్ ఏంటి అలా పెట్టావ్ నవ్వితే బాగుంటావ్ అంటారు. కానీ ఓ హీరోయిన్ ఏడిస్తేనే బాగుంటానని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే బ్యూటీని పెంచుకోవడానికి పలువురు పలు బ్యూటీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు. కానీ ఈ నటి కేవలం ఏడిస్తే చాలట. అందం దానంతట అదే వస్తుందని ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పుకొచ్చింది.
మరీ ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. తనకు ఏడవడం అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. అప్పుడప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియాలో ఏడ్చే పిక్స్ కూడా షేర్ చేస్తానని వెల్లడించింది. కన్నీళ్లు అనన్యకు నేచురల్ అందాన్ని ఇస్తాయని పేర్కొంది. ముఖం ప్రకాశవంతంగా మారిపోతుందని తెలిపింది.
ఏడుస్తున్నప్పుడు తప్పకుండా మిర్రర్‌లో చూసుకుంటానని, మామూలుగా కంటే ఏడుస్తున్నప్పుడే చాలా అందంగా కనిపిస్తానని బ్యూటీ అనన్య చెప్పుకొచ్చింది. అలాగే తను ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేనని, కాగా అనుకోకుండానే కళ్ల నుంచి కన్నీళ్లు వస్తుంటాయని వివరించింది. బ్యూటీని పెంచుకోవడానికి అప్పుడప్పుడు కావాలని ఏడుస్తానని కూడా ఈ నటి పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం అనన్య పాండే వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- Tags
- Ananya Pandey