Suriya: మీ రక్తం .. నా రక్తం వేరువేరా అంటూ స్టేజ్ పై ఎమోషనల్ గా మాట్లాడిన హీరో సూర్య

by Prasanna |   ( Updated:2024-11-09 07:44:36.0  )
Suriya: మీ రక్తం .. నా రక్తం వేరువేరా అంటూ స్టేజ్ పై ఎమోషనల్ గా మాట్లాడిన హీరో సూర్య
X

దిశ, వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) నటించిన ‘కంగువ’ (Kanguva). ఈ మూవీ వరల్డ్ వైడ్ గా నవంబర్ 14న విడుదల కానుంది. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దిశా పటాని హీరోయిన్ గా నటించింది. అలాగే, బాబి డియోల్ కూడా ప్రధాన పాత్రలో నటించాడు. సినిమా రిలీజ్ డేటు దగ్గర పడడంతో గ్యాప్ లేకుండా చిత్రం బృందం ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. అయితే, తాజాగా హైదరాబాద్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండుగా నిర్వహించారు. రాజమౌళి (SS Rajamouli) స్పెషల్ గెస్ట్ గా హాజరు కాగా, డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu), హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), విశ్వక్సేన్ (Vishwak Sen) హాజరయ్యి ఈ ఈవెంట్ ను సక్సెస్ అయ్యేలా చేశారు.

Advertisement

Next Story