ఆ హీరోయిన్‌తో లవ్‌లో పడిన బాలకృష్ణ.. పెళ్ళి వరకు వచ్చే సరికి ఏమైదంటే ?

by samatah |
ఆ హీరోయిన్‌తో లవ్‌లో పడిన బాలకృష్ణ.. పెళ్ళి వరకు వచ్చే సరికి ఏమైదంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ డైలాగ్ కింగ్ బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డైలాగ్స్‌కు అందరూ ఫిదా అవుతుంటారు. ఆయన ఏది చేసినా అది సెన్సేషన్ అవుతూ ఉంటుంది. అలాగే బాలకృష్ణ ఎంత సీరియస్‌గా ఉంటాడో పర్సనల్ లైఫ్‌లో అంత జోవియల్‌గా ఉంటాడు. తాను ఏ సినిమా చేసినా అక్కడన్న వారితో ఈజీగా కలసిపోతారు. అంతే కాకుండా సెట్‌లో అందరిని నవ్వించడంలోనూ, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వడంలో బాలయ్య ముందు ఉంటారు. ఆయన తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు ఎక్కడా ఎవరితో షేర్ చేసుకోరు. కానీ ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్‌లోని ఇష్యూ ఒకటి వైరల్‌గా మారింది. సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్‌లతో లవ్‌లో పడటం కామన్. కొందరి ప్రేమలు పెళ్లి వరకు వెళ్లితే, మరికొన్ని ప్రేమలు మధ్యలో ముగిసిపోతూ ఉంటాయి. అయితే సీనియర్ హీరో అయిన బాలక్రిష్ణకు కూడా ఓ లవ్ స్టోరి ఉందటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మద్రాస్‌లో ఓ అమ్మాయితో నందమూరి నటసింహ బాలక్రిష్ణ ప్రేమలో పడినట్టు, బాల‌య్య సినిమాల‌కు కాస్ట్యూమ్స్ విభాగంలో ప‌నిచేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీ రాపాక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే వారిద్దరు చాలా చనువుగా ఉండే వారని ఆమె తెలిపింది. అంతే కాకుండా వారు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కానీ ఆ విషయం ఎన్టీఆర్‌కు తెలియడంతో , ఆయన మందలించడంతో ఆ ప్రేమ కాస్త ముగిసిందని చెప్పింది. ఎన్టీఆర్‌కు సంప్రదాయం గల ఇంటి నుంచి కోడలిని తెచ్చుకోవాలని అనుకునేవారని, అందుకోసమే తన బంధువుల ఇంట్లోని అమ్మాయినిచ్చి బాలకృష్ణకు పెళ్లి చేసినట్లు పేర్కొంది.

Advertisement

Next Story