- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పర్యావరణానికి ముప్పుగా NFT మైనింగ్.. తప్పించుకునే దారేది..?
దిశ, ఫీచర్స్: పర్యావరణంపై ఎన్‌ఎఫ్‌టీ భారీ ప్రభావాన్ని చూపుతుందనే విషయం తెలిసిందే. ఎన్‌ఎఫ్‌టీల వల్ల కార్బన్ డై యాక్సైడ్ (CO2) ఉద్గారాలు విపరీతంగా విడుదలవుతాయని, ఆ ఎమిషన్స్‌ను భర్తీ చేసేందుకు మిలియన్ల చెట్లు అవసరమని ఎన్‌ఎఫ్‌టీ క్లబ్ కొత్త పరిశోధన పేర్కొంది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం గురించి ప్రపంచమంతా ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ ఆన్‌లైన్ ట్రేడింగ్ మరో ముప్పుగా పరిణమించింది.
ఎన్‌ఎఫ్‌టీని క్రియేట్ చేసేందుకు, దాని లావాదేవీని రికార్డ్ చేసేందుకు క్రిప్టో మైనింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒకదానికొకటి కనెక్ట్ చేయబడిన ప్రత్యేక కంప్యూటర్స్, పరికరాలు అవసరమవుతాయి. ఈ మొత్తం ప్రక్రియలో బ్లాక్‌చెయిన్‌కు ఏదైనా ఎన్‌ఎఫ్‌టీని జోడించేందుకు దాదాపు 83 కిలోల కార్బన్ డై యాక్సైడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుందని పరిశోధన పేర్కొంది. ఈ మేరకు ఎన్‌ఎఫ్‌టీ కోసం బిడ్ సమర్పించిన ప్రతిసారీ 23 కిలోల CO2 ఉత్పత్తి అవుతుండగా.. ఎన్‌ఎఫ్‌టీ విక్రయానికి 51 కేజీలు, ట్రాన్స్‌ఫర్ చేసే సమయంలో 30 కేజీల కార్బన్ ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఇక ఎన్‌ఎఫ్‌టీ క్లబ్ ప్రకారం ఎన్‌ఎఫ్‌టీ సేకరణలో ఇప్పటి వరకు క్రిప్టోకిట్టీస్- 239.83 మిలియన్ కేజీల CO2, సోరారే - 20.71 మిలియన్ కేజీల CO2, యాక్సీ ఇన్ఫినిటీ - 27 మిలియన్ కేజీల CO2, ఆర్ట్ బ్లాక్స్ - 23 మిలియన్ కేజీల CO2, ది శాండ్‌బాక్స్ - మిలియన్ కేజీలు విడుదల చేసింది.
మరేం చేయాలి..?
ఎన్‌ఎఫ్‌టీ బ్లాక్ చెయిన్ ప్రాసెస్‌లో వెలువడుతున్న ఉద్గారాల వల్ల పర్యావరణ కాలుష్యం పెరగకుండా ఉండాలంటే మరిన్ని ఎక్కువ చెట్లను నాటాలని ఎన్‌ఎఫ్‌టీ క్లబ్ చెబుతోంది. ఒక ఎన్‌ఎఫ్‌టీ సేల్‌ను ఆఫ్‌సెట్ చేసేందుకు కనీసం 1.37 చెట్లు అవసరమని సూచిస్తోంది. డూన్ అనలిటిక్స్ డేటా ప్రకారం ఇప్పటి వరకు కనీసం 13 మిలియన్ల విలువైన ఎన్‌ఎఫ్‌టీలు అమ్ముడయ్యాయని గమనించాలి. అంటే ఎకరం అడవి దాదాపు 1,764 ఎన్‌ఎఫ్‌టీ ట్రేడ్‌ల కర్బన ఉద్గారాలను భర్తీ చేయగలదు. ఉదాహరణకు, స్నూప్ డాగ్ ఎన్‌ఎఫ్‌టీ పోర్ట్‌ఫోలియోలో 3,683 ఎన్‌ఎఫ్‌టీలు ఉన్నాయి అనుకోండి. అంటే ఈ సేకరణ వల్ల పర్యావరణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి 5,050 చెట్లను నాటాలి. కాగా ఎన్‌ఎఫ్‌టీ పోర్ట్‌ఫోలియో పర్యావరణంపై ఎంత ప్రభావం చూపుతుంది.. దాని కర్బన ఉద్గారాలను భర్తీ చేయడానికి ఎన్ని చెట్లు అవసరమో తెలిపేందుకు పరిశోధకులు కొత్త కాలిక్యులేటర్‌ను కూడా రూపొందించారు.