- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Velomobile: ఇండియాకొచ్చిన 'సైకిల్ కారు', మన రోడ్లకు ఓకేనా..?!
దిశ, వెబ్‌డెస్క్ః ఇండియా లాంటి దేశాల్లో వాహనాలు ఏవైనా వాటి గ్రౌండ్ లెవల్ కాస్త ఎక్కువే ఉండాలి. మన రోడ్లు అలాంటివి మరి! అయితే, ఈ గ్లోబల్ వరల్డ్‌లో అనుమతి ఉన్న వాహనాలను అందరూ వాడుకోవచ్చు. ఇక, సిటీ రోడ్లు కాస్త మెరుగ్గా ఉంటాయి గనుక, బెంగళూరు లాంటి పెద్ద సిటీల్లో నయా మోడల్ వాహనాలు ఎప్పటికప్పుడు దిగుతూనే ఉంటాయి. ఇలాంటి చోట ఇప్పుడొక కొత్త వాహనం సిటీ ప్రజలకు దర్శనమిచ్చింది. అదే వెలోమొబైల్ బైసైకిల్ కారు. కొత్తగా ఉంటుంది కానీ మెత్తగా వెళ్ళిపోతుంది. బెంగళూరు రోడ్లు కాస్త నయం గనుక ఏలాగో మేనేజ్ చేయొచ్చని ఓ ఇండియన్ దీన్ని కొనేశాడు. వెలోమొబైల్ లేదా సైకిల్ కారుగా పిలిచే ఇది యూరప్‌లో చాలా సాధారణం. కానీ భారతీయ రోడ్లపై కనిపించదు. అయితే, ఇక్కడ పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా, ప్రజలకు ప్రత్యామ్నాయం తప్పట్లేదు. అందుకే, ఈ వ్యక్తి వెలోమొబైల్‌ను ఎంచుకున్నాడు.
సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించే వాహనంలా విచిత్రంగా కనిపించడంతో బెంగళూరువాసులు ఈ సైకిల్ కారును చూస్తూ నోరెళ్లబెట్టారు. ఏంటా ఇది అని ఆసక్తిగా దాని చుట్టూ చేరారు. అయితే, అదేమీ ఏలియన్ వాహనం కాదు! మానవ శక్తితో నడిచే మూడు చక్రాల మోడ్రన్ వాహనం అంతే. అయితే, ఇది మన మామూలు సైకిల్‌లా కాకుండా రక్షణగా చుట్ట అందమైన డిజైన్‌తో కవర్ చేసి ఉంటుంది. ఏరోడైనమిక్ ఆకారంలో ఉన్న బాడీవర్క్ కారణంగా, సైకిల్‌కి ఉపయోగించినంత ఎక్కువ బలం కాకుండా తక్కువ ప్రయత్నంతో, మంచి రోడ్లపై గంటకు 30-50 కి.మీ. వేగంతో వెళ్లొచ్చు. వెలోమొబైల్‌తో ఎంచక్కా షాపింగ్, హాలిడే ట్రిప్ లాంటి ఫన్ డ్రైవ్ చేయొచ్చు. 'అది సరే కానీ, గ్రౌండ్ లెవల్ చాలా తక్కువగా ఉండే ఈ సైకిల్ కారు మన రోడ్లకు ఓకేనా..?!' అనుకుంటున్నారు జనాలు.