ఒకరితో ప్రేమ, మరొకరితో పెళ్లి.. మండపంలో ప్రియురాలిని ఈడ్చుకుంటూ కొట్టిన బంధువులు

by samatah |   ( Updated:2022-04-15 07:30:51.0  )
ఒకరితో ప్రేమ, మరొకరితో పెళ్లి.. మండపంలో  ప్రియురాలిని ఈడ్చుకుంటూ కొట్టిన బంధువులు
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లీల సీజన్ వచ్చేసింది. ప్రస్తుతం చాలా చోట్ల వివాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాను ప్రేమించిన అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏ అమ్మాయి అయినా ఊరుకుంటుందా ? ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని మాయమాటలు చెప్పి, మోసం చేసిన యువకుడిని చూస్తే వచ్చే కోపం మాములుగా ఉండదు. అయితే ఇలాంటి ఘటనే తాజాగా ఖమ్మం జిల్లాలోని ఓ పెళ్లి మండపంలో చోటు చేసుకుంది. ప్రియుడు వేరే పెళ్లి చేసుకోవడానికి రెడీ కావడంతో.. పెళ్లి మండపానికి వెళ్లిన ప్రియురాలు పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేసింది. నన్నుకాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అంటూ వరుడుని చితకబాదింది. దీంతో వరుడి బంధువులు మండపంలోనే ప్రియురాలిని ఈడ్చుకుంటూ కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.


Advertisement

Next Story