- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెచ్ఐవి పేషెంట్ల మధ్య హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. ప్రపంచంలో తొలి విజయం..
దిశ, ఫీచర్స్ : న్యూయర్క్ మాంటెఫియోర్ హెల్త్ సిస్టమ్‌లోని డాక్టర్స్ ఇద్దరు హెచ్ఐవీ(HIV)పాజిటివ్ వ్యక్తుల మధ్య మొదటిసారిగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్(గుండె మార్పిడి) చేసి ప్రపంచంలోనే తొలి విజయం సాధించారు. హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న 60ఏళ్ల హెచ్ఐవీ పేషెంట్.. హార్ట్‌తో పాటు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం లైఫ్ సేవింగ్ డొనేషన్ అందుకుంది. దీంతో న్యూయార్క్ సిటీలోని మాంటెఫియోర్ హెల్త్ సిస్టమ్‌లోని వైద్యుల బృందం.. దాదాపు నాలుగు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి గుండె మార్పిడిని విజయవంతం చేశారు.
'ఈ ఆర్గాన్ డోనేషన్ అనేది వైద్యచరిత్రలో ఒక మైలురాయి. హెచ్ఐవీతో నివసించే వ్యక్తులు వ్యాధిని బాగా నియంత్రించగలుగుతారు. అంతేకాదు ప్రస్తుతం ఈ పరిస్థితిలో జీవిస్తున్న ఇతర వ్యక్తుల జీవితాలను కూడా కాపాడగలరు' అని మాంటెఫియోర్‌లోని కార్డియాక్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అండ్ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ ఉల్రిచ్ పి. జోర్డే ప్రకటనలో తెలిపారు. కాగా హాస్పిటల్‌లో ఐదు వారాల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న మహిళ ప్రస్తుతం కోలుకుంది. 2013లో యూఎస్ ప్రభుత్వం HIVఆర్గాన్ పాలసీ ఈక్విటీ చట్టంలో.. HIVతో జీవిస్తున్న వ్యక్తులు తమ అవయవాలను HIV-పాజిటివ్ గ్రహీతకు దానం చేసేందుకు వీలు కల్పించింది. అయితే, గుండె మార్పిడి కోసం ఈ అవకాశం వాస్తవంగా మారడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది.