- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెంపుడు శునకాల కోసం హెల్త్ టిప్స్.. వాటిపై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి
దిశ, ఫీచర్స్ : ప్రేమగా పెంచుకుంటున్న మూగజీవాలు అనారోగ్యం బారినపడితే వాటి యజమానుల గుండె తరుక్కుపోతుంది. పెట్స్ తిరిగి సాధారణ స్థితికి చేరుకునే వరకు మనసు కుదుటపడదు. పేలు, ఈగల వల్ల తలెత్తే దురద లేదా ఇతర గాయాలను సరైన చికిత్స ద్వారా తగ్గించవచ్చు. కానీ పెట్ డాగ్స్‌లో సంభవించే మూర్ఛ వంటి అనారోగ్యాలు మెడిసిన్‌తో తగ్గకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే కేర్ టేకర్స్ తమ పెట్స్ ఆరోగ్యం పట్ల ఆందోళన పడుతుంటారు. అయితే ఈ విషయంలో కంగారుపడాల్సిన అవసరం లేదంటున్న నిపుణులు.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని సూచిస్తున్నారు.
ఇల్లే సేఫ్ జోన్..
పెంపుడు జంతువులను గాయాల నుంచి రక్షించేందుకు వాటికి సురక్షిత వాతావరణాన్ని కల్పించడమే ఉత్తమ మార్గం. అందుకే పదునైన అంచులు గల ఫర్నిచర్‌తో పాటు టేబుల్‌పై గాజు సీసాలు, యాష్ ట్రేస్ లేదా మెడిసిన్స్ వంటి ప్రమాదకర వస్తువులను ఉంచవద్దు. దుప్పట్లు, కుషన్లు, పప్పీ ప్యాడ్స్‌తో పెట్స్‌కు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మూర్ఛ వచ్చినపుడు మీ పెట్ యానిమల్ గాయపడే అవకాశం తగ్గుతుంది.
ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవాలి..
కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మీ పెట్ యానిమల్ గాయపడవచ్చు. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో తెలుసుకున్నట్లయితే ఆ గాయాలకు మీరే చికిత్స చేయొచ్చు. ఎమర్జెన్సీ కిట్, అవసరమైన మందులు, గాయాలను నయం చేసే స్ప్రే, SOS మెడిసిన్స్‌ను స్టాక్ ఉంచుకోవాలి. ఇక ఎమర్జెన్సీ పెట్ క్లినిక్ నంబర్‌తో పాటు వెటర్నరీ డాక్టర్ నంబర్‌ను కూడా అందుబాటులో ఉంచుకోవడం ఉత్తమం.
ఆహారంలో మార్పులు..
దీర్ఘకాలిక జీవనశైలి మార్పులు మూర్ఛ వ్యాధి చికిత్సకు సహాయకారిగా పనిచేస్తాయి. ఈ వ్యాధితో బాధపడుతున్న పెంపుడు జంతువులకు అధిక కొవ్వు, తక్కువ పిండి పదార్థాలతో కూడిన కీటోజెనిక్ ఆహారాలు సాయపడతాయి. ఎందుకంటే అధిక కొవ్వులు న్యూరాన్ ఉత్తేజాన్ని తగ్గిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను కలిగిన చేప నూనెలు వంటి సప్లిమెంట్లు.. మెదడు నియంత్రణ ప్రక్రియలకు తోడ్పడతాయి. పెంపుడు జంతువు హెల్త్ కండిషన్‌పై ఆధారపడి వెటర్నరీ డాక్టర్ అందుకు అవసరమైన కొవ్వు ఆమ్లాలతో కూడిన సప్లిమెంట్లను సూచించవచ్చు. అందుకే పెట్స్ డైట్‌లో ఏవైనా మార్పులు చేసే ముందు పశువైద్యుడిని లేదా పెంపుడు జంతువుల పోషకాహార నిపుణుడిని సంప్రదించాలి.
మెడిసిన్ గురించి అవగాహన తప్పనిసరి..
జీవితకాలం వెంటాడే 'మూర్ఛ' వ్యాధి చికిత్సకు దీర్ఘకాలికంగా వాడే మందుల్లో కొన్ని తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కాబట్టి పశువైద్యుడిని సంప్రదించి అవి సరైన మందులేనని నిర్ధారించుకోవాలి. CBD ఆయిల్, ఆక్యుపంక్చర్, సప్లిమెంట్స్ వంటి సంపూర్ణ చికిత్సల గురించి తెలుసుకోవాలి. పెంపుడు జంతువుల్లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మూర్ఛల సంఖ్య, తీవ్రతను తగ్గించడంలో 'CBD ఆయిల్' గణనీయ మెరుగుదల చూపినట్లు నిపుణులు సూచిస్తున్నారు.
డైరీ మెయింటనెన్స్‌తో బెనిఫిట్స్..
*మూర్ఛ సంభవించే ఫ్రీక్వెన్సీ, తీవ్రతను ట్రాక్ చేసేందుకు డైరీ నిర్వహణ అనేది బెటర్ ఆప్షన్. మీ పెట్ డాగ్ మూర్ఛపోయిన సమయం, ఎన్నిసార్లు ఆ స్థితిని ఎదుర్కొంది? వాటి మధ్య వ్యవధి వంటి విషయాలను ట్రాక్ చేయాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో రికార్డింగ్.. కచ్చితమైన రోగ నిర్ధారణ, చికిత్స ప్రణాళికలకు సంబంధించి పశువైద్యునికి సాయపడుతుంది.
* ఎపిలెప్టిక్ ఎపిసోడ్‌ను ప్రేరేపించే కొన్ని పరిస్థితులను గుర్తించాలి. ఉదాహరణకు.. అతిథులు రావడం వంటి ఒత్తిడితో కూడిన పరిస్థితి ఈ ప్రతిస్పందనను ప్రేరేపించగలదు. డైరీ మెయింటనెన్స్ వల్ల ఒత్తిడితో కూడిన ఇలాంటి పరిస్థితులను గుర్తించి, విపత్కర పరిస్థితులను నివారించవచ్చు.
* పై విషయాల ఆధారంగా కాలక్రమేణా మీ పెంపుడు జంతువులు ఎపిలెప్టిక్ ఎపిసోడ్‌ను ఎదుర్కొన్నప్పుడు కొన్ని చిట్కాలు పనిచేస్తాయనే విషయం అర్థమవుతుంది. ఈ లక్షణాలు, చిట్కాలతో పాటు అవసరమయ్యే మెడిసిన్స్, కఠిన పరిస్థితుల గురించి డైరీలో రాసి పెట్టుకోవాలి. ఈ సమాచారం మీరు లేనప్పుడు మీ పెట్స్‌ను చూసుకునేవారు ఎవరికైనా సహాయకరంగా ఉంటుంది.
పెట్స్‌లో మూర్ఛ వ్యాధి..
మూర్ఛ అనేది నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్య. మెదడులో అసాధారణ ఎలక్ట్రిక్ యాక్టివిటీ కారణంగా ఏర్పడే జన్యుపరమైన రుగ్మత. అయితే మూర్ఛ, ఫిట్స్ మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఫిట్స్‌లోని ఒకే ఎపిసోడ్‌ను 'సీజర్'గా పిలుస్తారు. అదే అనేక భాగాలుగా సంభవిస్తే దాన్ని 'ఎపిలెప్సీ'గా పరిగణిస్తారు. ఇక శునకాల్లో మూర్ఛల విషయానికొస్తే.. చాలా అనూహ్యంగా, ఊహించని విధంగా ఉంటాయి. ఇది 30 నుంచి 90 సెకన్ల వరకు ఉండవచ్చు. అందుకే మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న పెంపుడు జంతువులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.