- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోషకాల గని.. ఆరోగ్యానికి డ్రాగన్ ఫ్రూట్‌తో ఎన్ని ఉపయోగాలో తెలుసా!
దిశ, ఫీచర్స్ : పండ్లలో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ లు ఉంటాయి. వాటిలో భాగంగా అధిక విటమిన్లు కలిగిన పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ పేరు తప్పక ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అందమైన గులాబీ- పసుపు రంగులో ఉండే పండు మాత్రమే కాకుండా.. ఇది వివిధ రకాల సమస్యలకు, ఇతర ప్రయోజనాలను అద్భుతమైన జౌషధంగా పని చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి.
ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ కెమికల్ ట్రీట్‌కి గురైన వెంట్రుకలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్లు, ఆర్థరైటిస్, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ విటమిన్ సి, ఇ, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు, ఫైబర్ ఉన్నాయి. సలాడ్ లేదా స్మూతీస్‌తో ఈ ఫ్రూట్‌ని తీసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అవేంటో తెలుసుకుందాం.
1.కొలెస్ట్రాల్:
మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగపడుతుంది. శరీర బరువుని తగ్గించడమే కాకుండా.. ఆరోగ్యవంతంగా మారుస్తుంది. బరువు తగ్గించే విషయంలో డ్రాగన్ ఫ్రూట్‌కి 100 మార్కులు ఇవ్వచ్చు.
2.డయాబెటిస్:
డ్రాగన్ ఫ్రూట్‌లో అత్యధింకా ఉండే ఫైబర్ డయాబెటీస్‌ని తగ్గించడానికి తోడ్పడుతుంది. ఈ పండు రక్తంలో ఉండే షుగర్ లెవల్స్‌ని తగ్గించి ఆరోగ్యవంతంగా మారుస్తుంది.
3.పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది:
ఈ ఫ్రూట్ పేగులో ఏర్పడే సమస్యల నివారణకు తోడ్పడుతుంది. పేగులో ఉండే బాక్టీరియాను నియంత్రిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ లాక్టిక్ ఆసిడ్, బైఫిడో బాక్టీరియా వంటి ప్రీబయోటిక్స్‌ను కలిగి ఉంటుంది. ఇవి ప్రేగులోని చెడు బాక్టీరియాతో ఫైట్ చేసి ఆరోగ్యవంతంగా చేస్తుంది.
4.హెల్తీ స్నాక్:
డ్రాగన్ ఫ్రూట్ ఆకలిని తీర్చడంలో తోడ్పడుతుంది. ఈ పండు అధిక ఫైబర్‌ని కలిగి ఉండడం వల్ల శరీరానికి మంచి పోషకాలను అందిస్తుంది.
5.దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతుంది:
డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీఆక్సీడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడుతాయి.ఈ పండు గుండె జబ్బులు, కాన్సర్లు, కీళ్ల నొప్పులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
6.ఆరోగ్యవంతమైన చర్మం:
డ్రాగన్ ఫ్రూట్ మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది. ఈ పండు గుజ్జులో, తేనెను కలిపి మొటిమలు ఏర్పడిన చోట రాసుకోవాలి. అలాగే వడదెబ్బ తగిలిన చర్మానికి దోసకాయరసంలో తేనె కలిపిన పేస్ట్‌ను చర్మానికి రాసుకోవాలి.
7. యాంటీఏజింగ్‌లా పనిచేస్తుంది:
డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ఆరోగ్యంగా, బిగుతుగా ఉంచుతాయి. రోజూ ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మీ చర్మం యవ్వనంగా, మెరిసేలా చేస్తుంది.
8.జుట్టు రంగుకి సహాయపడుతుంది
డ్రాగన్ ఫ్రూట్ కెమికల్ ట్రీట్ చేసిన జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది. దీని రసం లేదా గుజ్జు కలిగిన కండీషనర్‌ను తలపై అప్లై చేయడం వల్ల జుట్టు రంగు దెబ్బతినకుండా నిరోధించవచ్చు. ఇది జుట్టు కుదుళ్లను తెరిచి ఉంచుతుంది, అవి శ్వాస పీల్చుకోవడానికి మరియు ఆరోగ్యంగా,మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది.