Janaka Aithe Ganaka: ‘జనక అయితే గనక’ సినిమా బాగుందన్నారు .. కలెక్షన్స్ వచ్చింది ఇంతేనా?

by Prasanna |   ( Updated:2024-10-15 14:25:29.0  )
Janaka Aithe Ganaka: ‘జనక అయితే గనక’ సినిమా బాగుందన్నారు .. కలెక్షన్స్ వచ్చింది ఇంతేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసుకుంటూ సినిమా హీరో వరకు ఎదిగిన సుహాస్ (Suhas) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే హీరోగా ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. తాజాగా ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) కూడా ఆడియెన్స్ ముందుకొచ్చింది. అక్టోబర్ 12న ఈ మూవీ విడుదల అయింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ అందర్ని ఆకట్టుకున్నాయి. మొదటి రోజు ఫస్ట్ షో పాజిటివ్ టాక్ వచ్చింది. 'జనక అయితే గనక’ మూవీ అందరూ బాగుందన్నారు. కానీ, కలెక్షన్స్ మాత్రం యావరేజ్ గా వచ్చాయి. ఒకసారి మూడు రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే..

నైజాం - 0.48 CR

సీడెడ్ - 0.08 CR

ఆంధ్ర(టోటల్) - 0.44 CR

ఏపీ + తెలంగాణ(టోటల్) - 01.00 CR

రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.10 CR

ఓవర్సీస్ - 0.20 CR

వరల్డ్ వైడ్(టోటల్) - 01.40 కేర్

‘జనక అయితే గనక’ మూవీకి రూ.3.5 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.4 కోట్లను కలెక్ట్ చేయాలి. ఇంత చిన్న టార్గెట్ ను కూడా రీచ్ అవ్వలేకపోయింది. దీంతో మూడు రోజుల్లో రూ.1.40 కోట్లను మాత్రమే కలెక్ట్ చేసింది.

Advertisement

Next Story