ఇషాన్‌ కిషన్‌కు ఫ్యాన్ అయిపోయానంటున్న.. మాజీ క్రికెటర్

by Vinod kumar |   ( Updated:2022-03-28 14:43:17.0  )
ఇషాన్‌ కిషన్‌కు ఫ్యాన్ అయిపోయానంటున్న.. మాజీ క్రికెటర్
X

న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్‌కు తాను అభిమానిని అయిపోయానని టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా భజ్జీ మాట్లాడుతూ.. 'ఇషాన్ కిషన్ పరిణతి చెందిన ఆటగాడు. బ్యాటర్‌గా ఎంత సమర్థుడో మరోసారి నిరూపించుకున్నాడు. అతని ఆటతీరుకు నేను అభిమానిని అయిపోయా' అని చెప్పుకొచ్చాడు. అయితే, గతంలో తన బౌలింగ్‌లో ఇషాన్ రెండు లేదా నాలుగు సిక్సర్లు బాదిన తీరును హర్భజన్ గుర్తుచేసుకున్నాడు. కాగా, ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచులో ఇషాన్ కిషన్ కేవలం 48 బంతుల్లో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Advertisement

Next Story