HDFC: లాభాలతో దూసుకుపోతున్న అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్!

by Harish |   ( Updated:2022-04-16 11:24:39.0  )
HDFC: లాభాలతో దూసుకుపోతున్న అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు HDFC మార్చితో ముగిసిన త్రైమాసికంలో 23 శాతం వార్షిక వృద్ధితో 10,055.20 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది త్రైమాసికంలో బ్యాంక్ రూ.8,187 కోట్ల లాభాన్ని ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం (NII), బ్యాంక్ తన రుణ కార్యకలాపాల ద్వారా సంపాదించే వడ్డీ ఆదాయానికి, డిపాజిటర్లకు చెల్లించే వడ్డీకి మధ్య వ్యత్యాసం, క్రితం సంవత్సరం-త్రైమాసికంలో రూ. 17,120.20 కోట్ల నుంచి 10.2 శాతం పెరిగి రూ. 18,872.70 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్ (NIM) మొత్తం ఆస్తులపై 4 శాతం, వడ్డీ ఆదాయ ఆస్తుల ఆధారంగా 4.2 శాతంగా ఉంది. ఈ త్రైమాసికంలో అడ్వాన్స్‌లు 20.8 శాతం పెరిగి రూ.13,68,821 కోట్లకు చేరుకున్నాయి. ఈ త్రైమాసికంలో డిపాజిట్లు 16.8 శాతం పెరిగి రూ.15,59,217 కోట్లకు చేరుకున్నాయి. కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్స్ (CASA) డిపాజిట్లు సంవత్సరానికి దాదాపు 22 శాతం వృద్ధితో రూ.7.51లక్షల కోట్లకు చేరుకుంది. మార్చి త్రైమాసికం 2022 చివరి నాటికి కేటాయింపులు, ఆకస్మిక అంశాలు 29.4 శాతం తగ్గి రూ. 3,312.4 కోట్లకు పడిపోయాయి. వడ్డీయేతర ఆదాయం అర శాతం పెరిగి రూ. 7,637 కోట్లకు చేరుకుంది. వ్యాపార ఆదాయం సంవత్సరానికి 10.6 శాతం పెరిగితే రుసుము ఆదాయం రూ. 5,630 కోట్లుగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed