రీఎంట్రీ కోసం హాట్ బ్యూటీ ఆరాటం.. అలాంటి కంటెంట్ కావాలంటూ

by sudharani |
రీఎంట్రీ కోసం హాట్ బ్యూటీ ఆరాటం.. అలాంటి కంటెంట్ కావాలంటూ
X

దిశ, సినిమా : హాట్‌బ్యూటీ హర్లీన్ సేథీ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్‌లో చాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలిపింది. ఆరు నెలలుగా వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నందున బాలీవుడ్‌ 'ఏ' లిస్ట్‌లో స్థానం కోల్పోయినట్లుగా అభిప్రాయపడింది. ఏదేమైనప్పటికీ బడా ప్రాజెక్ట్‌తో గ్రాండ్‌ రీఎంట్రీ కోసం చేస్తున్న పోరాటం తననెప్పుడూ నిరుత్సాహపరచదని చెప్పింది. ఈ క్రమంలోనే ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న 'ది గాన్ గేమ్ సీజన్ 2'ను తన చివరి వెబ్ విహారయాత్రగా పేర్కొన్న నటి.. ఇక్కడ విభిన్న ప్రాజెక్ట్‌లతో తనను తాను గొప్ప కళాకారిణిగా అన్వేషించడంలో సంతృప్తి ఉందని పేర్కొంది. ఓటీటీలు కూడా అదిరిపోయే కంటెంట్‌తో ఎంతోమందికి స్టార్ స్టేటస్ కల్పిస్తున్నాయన్న హర్లీన్.. తన నటనను జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారో తెలియదు కానీ గొప్ప నటులు, దర్శకులతో రెండో సీజన్‌ పూర్తి చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఏ రంగమైనా వ్యాపారంతోనే ముడిపడి ఉందంటూ ముగించింది.

Advertisement

Next Story