- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ సినిమాకు అడ్డు పడుతున్న త్రివిక్రమ్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పవర్ స్టార్ అభిమానులంతా పవన్ అప్‌కమింగ్ మూవీ 'భగవదీయుడు భగత్‌సింగ్' మూవీ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కనుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అంటూ సోషల్ మీడియాలో భారీగా చర్చలు చేస్తున్నారు. కానీ దీనిపై క్లారిటీ అయితే ఇప్పటి వరకు రాలేదు. అయితే కొన్ని రోజుల నుంచి ఈ మూవీ పట్టాలెక్కకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అడ్డుపడుతున్నాడని, మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సినిమా చేయొద్దని పవన్‌ను ఆపుతున్నాడంటూ సినీ సర్కిల్స్‌తో వార్తలు తెగ వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్ శంకర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. తన సినిమాకు త్రివిక్రమ్ అడ్డుపడుతున్నారన్న విషయం ఒట్టి అబద్దం అని కొట్టి పారేశాడు. ''భగవదీయుడు భగత్‌సింగ్' సినిమా ప్రారంభం కాకుండా డైరెక్టర్ త్రివిక్రమ్ అడ్డుపడుతున్నారన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ప్రస్తుతం పవన్‌కు కమిట్‌మెంట్స్ పూర్తియిన వెంటనే సినిమా మొదలవుతోంది. దాదాపు 2022 జూన్‌లో సినిమా పట్టాలెక్కుతుంది' అని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. దీంతో పవన్ అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. సమ్మర్‌లో పవర్ స్టార్ పవర్ ఫుల్ అప్‌డేట్స్ పక్కా అంటూ ఊహాగానాలు చేస్తున్నారు. మరి సినిమా అప్పటికి స్టార్ అవుతుందో లేదో చూడాలి.