యాపిల్, మెటాకు హ్యాకర్స్ షాక్.. వాటి కోసం చట్టపరమైన అభ్యర్థనలు

by Javid Pasha |
యాపిల్, మెటాకు హ్యాకర్స్ షాక్.. వాటి కోసం చట్టపరమైన అభ్యర్థనలు
X

దిశ, వెబ్‌డెస్క్: హ్యాకర్స్‌కు ఎప్పుడు పెద్ద సంస్థలే టార్గెట్. వాటి వినియోగదారుల డేటాను కాజేసేందుకు హ్యాకర్లు అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో కొన్ని సంస్థల విషయంలో విజయం సాధించే హ్యాకర్లు కొన్ని కంపెనీల దగ్గర బొక్కబోర్లా పడతారు. అయితే ఇటీవల యాపిల్, మెటా సంస్థలకు హ్యాకర్లు షాక్ ఇచ్చారు. తమ కంపెనీ వినియోగదారుల డేటాను కోరుతూ నకిలీ చట్టపరమైన అభ్యర్థనలు చేశారు. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించి రెండు సంస్థలు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కానీ ఒక్కసారిగా ఈ సంస్థలు తమ వినియోగదారుల డేటాకు సంబంధించి పాలసీ పత్రాలను షేర్ చేశాయి. దీంతో ఈ వార్తలు నిజమేనన్న చర్చలు జరుగుతున్నాయి. దానికి తోడుగా కొందరు హ్యాకర్లు డేటా కోసం 'ఎమర్జెన్సీ డేటా రిక్వెస్ట్' పాలసీని వినియోగిస్తారని ఇటీవల మెటా సంస్థ చెప్పుకొచ్చింది. ఈ వార్తలపై ఇరు సంస్థలు స్పందిస్తూ తమకు వచ్చే అభ్యర్థనలను పూర్తి స్థాయి లీగల్, అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ప్రాసెస్‌ల తర్వాత మాత్రమే ఇస్తామని, అభ్యర్థన వచ్చిన వెంటనే ఇవ్వడం జరగదని తెలిపారు.

Next Story

Most Viewed