- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చార్మినార్ దగ్గర అతడితో కలిసి కనిపించిన టాలీవుడ్ నటి.. షాక్‌లో నెటిజన్లు (వీడియో)

దిశ, సినిమా: టాలీవుడ్ నటి బిందు మాధవి(Bindu Madhavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ పలు తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అలాగే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చేసి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా బిందు బాధవి రామ్ నటించిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’(Rama Rama Krishna Krishna)చిత్రంతో పాపులారిటీ తెచ్చుకుని హీరోయిన్‌గా రాణిస్తోంది. అంతేకాకుండా రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss)లోనూ పాల్గొని విన్నర్‌గా నిలిచింది. దీంతో బిందు మాధవి రేంజ్ మారిపోయింది.
స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు పలు చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. తాజాగా, బిందు మాధవికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ వ్యక్తితో కలిసి స్కూటీపై కూర్చొని ఎక్కడికో వెళ్తున్నట్లు కనిపించింది. ఇక అది చూసిన నెటిజన్లు అతను ఎవరా అని నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. అలాగే ఆమె ప్రేమలో పడిందనే ప్రచారం మొదలుపెట్టారు. ఇక ఆమె అభిమానులు మాత్రం అవన్నీ పుకార్లు అని కొట్టిపారేస్తున్నారు. అయితే వీడియో చూసినట్లు అయితే అది ఒక రైడ్ రేసింగ్‌గా కనిపిస్తోంది.
Bindu Madhavi in Hyderabad at charminar pic.twitter.com/PN7ylRFcvg
— PJ (@BBTeluguViews) March 25, 2025