- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మోడల్ దారుణ హత్య.. అతడిని విమర్శించినందుకే ఇలా..?
దిశ, వెబ్‌డెస్క్: రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను 'సైకోపాత్' అని తిట్టి వెలుగులోకి వచ్చిన రష్యన్ మోడల్ గ్రెట్టా వెడ్లెర్.. దారుణ హత్యకు గురైంది. ప్రస్తుతం ఈ ఘటన రష్యాలో సంచలనం రేపుతోంది. దారుణ హత్యకు గురై.. పాతసూట్‌కేసులో కుక్కి ఈమె డెడ్ బాడీ ఓ ఫాం హౌస్‌లో లభ్యమయింది. అయితే ఈమె గతంలో అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేఖంగా ఓ వివాదాస్పద పోస్ట్ పెట్టింది. ''బాల్యంలో పుతిన్ చాలా అవమానాలను గురయ్యాడు. అలా కావడానికి కారణం అతని ఫిజిక్.. దీనితో అతడు తన కోసం తాను నిలబడలేకపోయాడు. న్యాయ విద్యను విడిచిపెట్టి KGB లో చేరడానికి అదే కారణం కావచ్చు. అందుకే నా దృష్టిలో పుతిన్ ఒక మానసిక రోగి'' అంటూ విమర్శించింది. అధ్యక్షుడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే ఆమె కనిపించకుండా పోయింది. తాజాగా ఇప్పుడు ఏడాది తర్వాత మృతదేహామై కనిపించింది. వెడ్లెర్ మరణానికి సంబంధించి రష్యా అధికారులు ఓ వీడియో విడుదల చేశారు. దీనిలో వెడ్లెర్‌ను ఆమె ప్రియుడు దిమిత్రి కోరోవిన్ డబ్బు కోసం హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పుతిన్‌కు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని ఆమె ప్రియుడు అంగీకరించాడు. ఇదిలా ఉంటే గెడ్లెర్ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.