ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు హరితహారం అవార్డ్!

by Web Desk |
ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు హరితహారం అవార్డ్!
X

దిశ, నాచారం: పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఈ కార్యక్రమంలో పూర్తి భాగస్వాములై అధికంగా మొక్కలు నాటిన అందుకుగాను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు హరితహారం అవార్డు లభించింది. ఈ అవార్డును రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థల చైర్మన్ మల్కా కొమురయ్య అందుకున్నారు.

హైదరాబాద్ నగరంలో కాకతీయ ఐటిసి లో జరిగిన తెలంగాణ లీడర్ షిప్ సమ్మిట్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థల చైర్మన్ మల్కా కొమురయ్య, వైస్ చైర్మన్ మల్కా యశస్వి మంత్రి కేటీఆర్, భారత్ బయోటెక్ ఎండి డాక్టర్ కృష్ణ ఎల్ల, తెలంగాణ సిఐఐ ఎండి సమీర్ గోయల్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ జైయెస్ రంజాన్, కోరమండల్ ఎండి రంగనాథ్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

2021 సంవత్సరం లో హరితహారం కార్యక్రమంలో అత్యధికంగా మొక్కలు నాటినందుకు ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య మాట్లాడుతూ.. అవార్డు రావడం బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం ప్రిన్సిపాల్ సునీతా రావు, నాదల్ గూడ ప్రిన్సిపాల్ జ్యోతి, పిఆర్‌ఓ మైకేల్ రాబర్ట్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed