GPL: లవ్ ఇన్వెస్టిగేషన్ & సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘జిపిఎల్’

by sudharani |
GPL: లవ్ ఇన్వెస్టిగేషన్ & సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘జిపిఎల్’
X

దిశ, సినిమా: పవన్ శంకర్ (Pawan Shankar), యాని (Yani), తనికెళ్ళ భరణి (Tanikel Bharani), హెబ్బ పటేల్ (Hebba Patel), బ్రహ్మాజీ (Brahmaji), నాగ మహేష్ (Naga Mahesh), నవీన్ (Naveen) ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘జిపిఎల్’ (GPL). అల్లు ఆర్ట్స్ (Allu Arts) ప్రొడక్షన్స్ బ్యానర్ (banner)పై ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో అల్లు లత (Allu Lata) ప్రేసెన్స్‌తో అల్లు సాయి లక్ష్మణ్ (Allu Sai Laxman) నిర్మాతగా, రావు జి.ఎం నాయుడు (Rao GM Naidu) డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

లవ్ ఇన్వెస్టిగేషన్ (Love Investigation) సస్పెన్స్ థ్రిల్లర్ (Suspense Thriller)గా తెరకెక్కుతున్న ‘జిపిఎల్’ చిత్రం షూటింగ్ హైదరాబాద్ (Hyderabad), వైజాగ్ (Vizag), కోడైకెనాల్ (kodaicanol)లో జరగనుంది. ఇక నవంబర్ (November) 14 నుండి ఈ మూవీ మొదటి షెడ్యూల్ (Schedule) ప్రారంభం కానుంగా.. తాజాగా ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రావు జి.ఎం. నాయుడు, నిర్మాత అల్లు సాయి లక్ష్మణ్ మాడ్లాడుతూ.. ‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుందని’ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story