ఎల్ఐసీ ఐపీఓ ఆలస్యమయ్యే అవకాశం!?

by Disha Desk |
ఎల్ఐసీ ఐపీఓ ఆలస్యమయ్యే అవకాశం!?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఐపీఓకు కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే ఐపీఓ డ్రాఫ్ట్‌ను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా రష్యా-ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం వల్ల గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం ప్రతికూలంగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎల్ఐసీ ఐపీఓ జాప్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సంబంధిత అధికారులు అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి సైతం దీనిపై స్పందిస్తూ ఐపీఓకు ఎప్పుడు వెళ్లాలనే తేదీ గురించి చర్చించాలని ఓ ప్రకటనలో అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ సంక్షోభం వల్ల మార్కెట్ల పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వ అధికారి వివరించారు. ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. తద్వారా రూ.63,000 కోట్ల వరకు నిధులను సమీకరించాలని భావిస్తోంది. గత నెలలోనే ఐపీఓ కోసం ప్రభుత్వం సెబీకి డ్రాఫ్ట్ ఫైల్‌ను దాఖలు చేసింది.

Advertisement

Next Story