Governor Tamilisai: రేపు బాసర ట్రిపుల్ ఐటీకి గవర్నర్ తమిళిసై

by Sathputhe Rajesh |   ( Updated:2022-08-06 10:50:05.0  )
Governor Tamilisai to visit Basara IIIT On 7 August
X

దిశ, డైనమిక్ బ్యూరో: Governor Tamilisai to visit Basara IIIT On 7 August| తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రేపు బాసరలో పర్యటించనున్నారు. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులతో ప్రత్యేకంగా రాజ్‌భవన్‌లో భేటీ అయిన గవర్నర్ తమిళిసై, రాష్ట్రంలో 75కాలేజీలను సందర్శించబోతున్నట్లు తెలిపారు. అందులో బాసర త్రిపుల్ ఐటీ కూడా ఉందని విద్యార్ధులతో అన్నారు. కాగా బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించేందుకు ఇవాళ రాత్రి కాచిగూడ రైల్వేస్టేషన్ నుండి బాసరకు గవర్నర్ తమిళిసై వెళ్లనున్నారు. రేపు ఉదయం 6 గంటలకు సరస్వతీ అమ్మవారిని దర్శించుకుంటారు. తరువాత 7 గంటలకు విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యార్థులు, ఉద్యోగులతో మాట్లాడనున్నారు. అనంతరం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. కాగా, ట్రిపుల్ ఐటీలో గత కొన్ని రోజులుగా ఎన్నో సమస్యలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో తమ సమస్యలను పరిష్కారించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారం రోజు పాటు ఆందోళనకు దిగగా.. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ మేరకు నిరసనలకు ముగింపు పలికారు. మంత్రి హామీ ఇచ్చినప్పటికీ.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకుండా పోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏమిటిది కేసీఆర్ ? బర్త్‌డేకు హాజరు కాకపోతే షోకాజ్ నోటీసులా ?

Advertisement

Next Story