యాదాద్రి లో గవర్నర్ తమిళిసై పూజలు

by Mahesh |
యాదాద్రి లో గవర్నర్ తమిళిసై పూజలు
X

దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి దేవస్థానాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ సందర్శించారు. బాలాలయంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు సంయుక్తంగా ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న అలంకార సేవలో గవర్నర్ పాల్గొన్నారు. అంతకు ముందు పూర్తయిన ప్రధానాలయ నిర్మాణాలను గవర్నర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అదేవిధం గా సోమవారం రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలకు సంతోషం కల్పించాలని కోరుకున్నట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా తాను తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యాను అని వారితో మంచి అటాచ్మెంట్ కలిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి, డీసీపీ నారాయణ రెడ్డి, ఆలయ ఈవో ఎన్ గీత, అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story