- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తనపై తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలు ఉన్నాయి: తమిళి సై
దిశ, అంబర్‌పేట్: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబ వ్యవస్థ ఆనందంగా ఉంటుందని రాష్ట్ర గవర్నర్ తమిళి సై అన్నారు. అక్షర స్ఫూర్తి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టిందని తెలిపారు. డ్వాక్రా పథకం ద్వారా మహిళలు బ్యాంక్ రుణంతో స్వయం ఉపాధి పొందుతున్నారని అన్నారు. స్త్రీ ఆర్థికంగా బల పడితేనే, కుటుంబం శక్తివంతంగా ఉంటుందని వివరించారు. మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని బ్లెడ్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా తరచూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజలు తనపై ప్రేమాభిమానాలు చూపుతున్నరని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి పొందేలా వివిధ వృత్తి పనుల్లో నైపుణ్యం పెంచుకునే విధంగా శిక్షణ కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. ఐదేళ్లలో ఆరువేల మందికి శిక్షణ ఇచ్చామని వివరించారు. అక్షర స్ఫూర్తి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర శిక్షణ సంస్థ అధ్యక్షురాలు కుష్బూ, అలీఫ్ అధ్యక్షులు రమాదేవి, అక్షర నిర్వహకురాలు కే.ఉమ, కార్పొరేటర్లు సుప్రియ నవీన్ గౌడ్, పావని వినయ్ కుమార్, రచన శ్రీ, శిరీష, రజని, శైలజ తదితరులు పాల్గొన్నారు.