బీబీనగర్‌లో ఎయిమ్స్ వైట్ కోర్టు సెమినార్.. హాజరైన గవర్నర్ తమిళి సై

by S Gopi |   ( Updated:2022-03-12 10:41:50.0  )
బీబీనగర్‌లో ఎయిమ్స్ వైట్ కోర్టు సెమినార్.. హాజరైన గవర్నర్ తమిళి సై
X

దిశ, భువనగిరి రురల్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని ఎయిమ్స్ లో శనివారం 2021-22 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులకు నిర్వహించిన వైట్ కోర్ట్ సెరమోనీ కార్యక్రమానికి గవర్నర్ తమిళసై సౌందర రాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులోకి రావాలని అన్నారు. తన భర్త కూడా నెఫ్రాలజిస్ట్ అని, తాను గైనకాలజిస్ట్ అని అల్ట్రా సౌండ్ లో తనకు మంచి అనుభవం ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా ఐరన్ మాత్రలు వేసుకుంటే పుట్టే పిల్లలు నల్లగా పుడతారని అపోహతో గర్భిణులు ఐరన్ మాత్రలు పడేస్తున్నారని కానీ.. ఐరన్ మాత్రల వల్ల కలిగే ప్రయోజనాలు వారికి తెలియపరిచేలా కృషి చేయాలని అన్నారు. కెనడా వెళ్లి తాను ఫెటల్ థెరపీ నేర్చుకోవడం జరిగిందని.. ఈ థెరపీ డిజబుల్ పిల్లలకు ఉపయోగపడుతుందని అన్నారు. వైద్య వృత్తిని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలని.. ముఖ్యంగా రోగ లక్షణాల గురించి ఎక్కువ నేర్చుకోవాలని ఆమె విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు ఆఫ్ లైన్ క్లాస్ లు నిర్వహించినందుకు ఎయిమ్స్ సిబ్బందిని అభినందించారు. మెడికల్ ఎడ్యుకేషన్ కి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం అమలులో ఉందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed