ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బంపర్ ఆఫర్..

by Manoj |   ( Updated:2022-03-18 13:05:32.0  )
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బంపర్ ఆఫర్..
X

దిశ, వెబ్‌డెస్క్: కాశ్మీర్ ఫైల్స్ విడుదలైన రోజు నుండి మంచి ప్రశంసలు పోందుతోంది. కాశ్మీరీ మారణకాండలో కాశ్మీరీ పండిట్‌లు ఎలా దారుణంగా చంపబడ్డారు అనే అంశంపై ఈ సినిమా తెరకెక్కింది. అయితే గత కొంత కాలంగా కొన్ని ప్రభుత్వాలు సినిమాకు సంబంధించి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అస్సాం ప్రభుత్వం ఏకంగా తమ ప్రభుత్వ ఉద్యోగులు కాశ్మీర్ ఫైల్స్ చూడడానికి హాఫ్-డే స్పెషల్ లీవ్‌ ఇచ్చింది. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఉత్తరాఖండ్.. వంటి రాష్ట్రాలు ఈ చిత్రానికి పన్ను లేకుండా చేశాయి.

తాజాగా బీహార్ ప్రభుత్వం రాష్టంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 'ది కాశ్మీర్ ఫైల్స్' స్పెషల్ స్క్రీన్‌ను ఏర్పాటే చేయనుంది. మార్చి 25న సాయంత్రం 6.30 గంటలకు పాట్నాలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ''కాశ్మీరీ పండిట్‌ల దీనగాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది.. దీన్ని మరింత మంది చూడాల్సిన అవసరం ఉంది'' అని డిప్యూటీ సీఎం తార్కిషోర్ ప్రసాద్ అన్నారు.

Advertisement

Next Story