Google Street View.. ఆరేళ్ల నిషేధం తర్వాత రీలాంచ్

by Hamsa |   ( Updated:2022-07-28 09:15:35.0  )
Google Launches Street View Feature in India After six years of ban
X

దిశ, ఫీచర్స్ : Google Launches Street View Feature in India After six years of ban| భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు ఆరేళ్ల క్రితం నిషేధించబడిన 'గూగుల్ స్ట్రీట్ వ్యూ' సర్వీస్‌ను టెక్ దిగ్గజం గూగుల్ భారత్‌లో తిరిగి ప్రారంభించింది. యూజర్లు ఈ ఫీచర్ ఉపయోగించి తమ ఫోన్‌లోనే ల్యాండ్‌మార్క్స్, టూరిస్ట్ స్పాట్స్, రెస్టారెంట్స్, మాల్స్ తదితర ప్రదేశాలను వాస్తవంగా అన్వేషించవచ్చు. అంతేకాదు స్పీడ్ లిమిట్స్, రోడ్ క్లోజింగ్స్, ఇతరత్రా అంతరాయాలకు సంబంధించిన సమాచారాన్ని ఇందులో పొందవచ్చు. ఈ అప్‌డేటెడ్ ఫీచర్ సాయంతో యూజర్లు ట్రాఫిక్ పరిస్థితులతో పాటు తాము చేరుకోవాల్సిన డెస్టినేషన్ గురించి షార్ట్‌కట్స్‌ను కూడా వీక్షించగలరు.

ఈ ప్రాజెక్ట్ కోసం స్థానిక దిగ్గజాలు టెక్ మహీంద్రా, జెనెసిస్ ఇంటర్నేషనల్‌(మ్యాపింగ్ సొల్యూషన్ కంపెనీ)తో చేతులు కలిపిన గూగుల్.. ముందుగా 10 భారతీయ నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇదే క్రమంలో ఏడాది చివరి నాటికి 50 దేశీయ నగరాలకు విస్తరించాలని భావిస్తోంది. ఇక 'స్ట్రీట్ వ్యూ' కోసం థర్డ్-పార్టీ కంపెనీలతో గూగుల్ జతకట్టడం ఇదే తొలిసారని ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఇందుకోసం పైన పేర్కొన్న రెండు కంపెనీలు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పుణె, నాసిక్, వడోదర, అహ్మద్‌నగర్, అమృత్‌సర్‌లో 150,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి. మొత్తానికి దాదాపు 15 ఏళ్లుగా యాక్టివ్‌గా ఉన్న ఈ స్ట్రీట్ వ్యూ సర్వీస్.. ఈ మొత్తం పీరియడ్‌లో 100కు పైగా దేశాలు, భూభాగాలకు సంబంధించి 220 బిలియన్ వీధి వీక్షణ చిత్రాలను సంగ్రహించింది.

ఇపుడు వినియోగదారులు గూగుల్ మ్యాప్స్‌లో పైన పేర్కొన్న 10 నగరాల్లోని ఏదైనా నిర్దిష్ట వీధిని జూమ్ చేస్తే చాలు.. 'స్ట్రీట్ వ్యూ' సర్వీస్‌ను ఈజీగా పొందవచ్చు. రద్దీగా ఉండే వీధుల్లో దుకాణాలు, కేఫ్‌ల కోసం వెతికేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది, పరిసరాలను సులభంగా అన్వేషించేందుకు వీలు కల్పిస్తుంది. ప్రస్తుతానికి ఈ సర్వీస్ బెంగళూరులో పైలట్ ప్రాతిపదికన పని చేస్తుండగా.. త్వరలోనే హైదరాబాద్‌, కోల్‌కతా సహా మిగతా నగరాలను ఇందులో చేర్చనున్నట్లు గూగుల్ ప్రతినిధి వెల్లడించారు.

ఇది కూడా చదవండి: బండిలో స‌రిపోనూ పెట్రోల్ లేక‌పోతే రూ.250 ట్రాఫిక్ చలాన్‌!!

Advertisement

Next Story

Most Viewed