- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లైన ఐదేళ్లకు గుడ్ న్యూస్.. ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉందంటూ నటి ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, సినిమా: బుల్లితెర నటి రుహి చతుర్వేది(Ruhi Chaturvedi) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె ‘కుండలి భాగ్య’ సీరియల్‌లో షెర్లిన్ ఖురానా(Sherlyn Khurana) పాత్రలో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా రుహి మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2010 పోటీల్లోనూ పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. 2012లో ‘ఆలాప్’(Alap) అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ‘ఖత్రోన్ కే కిలాడీ సీజన్-13’(Khatron Ke Khiladi Season-13) షోలో పాల్గొంది. ఇక రుహి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. బుల్లితెరపై సీరియల్స్ చేస్తుండగానే.. నటుడు శివేంద్ర ఓం సాయినియోల్(Shivendra Om Sainiyol)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఓ వైపు భర్తతో వెకేషన్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తునే.. సీరియల్స్‌లోనూ నటిస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులు పెడుతోంది. తాజాగా, రుహి(Ruhi Chaturvedi) సోషల్ మీడియా ద్వారా ఓ గుడ్ న్యూస్(good news) ప్రకటించింది. తాను తల్లి కాబోతున్నట్లు తెలుపుతూ బేబీ బంప్ వీడియోను షేర్ చేసింది. అంతేకాకుండా ‘‘మా అందమైన కుటుంబం ఇంకాస్త పెద్దగా అవుతోంది. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఈ అమ్మడు పెళ్లైన ఐదేళ్లకు తల్లి కాబోతుండటంతో రుహి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.