నేడే డేనైట్ టెస్టు.. క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్‌

by GSrikanth |
నేడే డేనైట్ టెస్టు.. క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్‌
X

దిశ, వెబ్‌డెస్క్: క్రీడాభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-శ్రీలంక మధ్య జరుగనున్న రెండో టెస్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నేడు(శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది. అయితే, డే నైట్ జరుగబోయే ఈ పింక్ బాల్ టెస్టుకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండో టెస్టుకు స్టేడియంలోకి వందశాతం ప్రేక్షకులను అనుమతిచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో టీ20, వన్డే, టెస్ట్ అనే తేడా లేకుండా భార‌త్‌ వరుస విజయాలతో దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల కోరిక మేరకు పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చారు.

జట్లు అంచనా:

భారత్: రోహిత్ శర్మ (సి), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (w), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, ఉమేశ్ గిల్, ప్రియాంక్ పంచాల్, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్

శ్రీలంక: దిముత్ కరుణరత్నె(సి), లహిరు తిరిమన్నె, కుసల్ మెండీస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, నిరోషన్ డిక్వెల్లా(w), సురంగ లక్మల్, లసిత్ ఎంబుల్దెనియా, విశ్వ ఫెర్నాండో, లహిరు కుమారిక్, ప్రవీణ్ జయవిక్, ప్రవీణ్ జయవిష్మల్ చమికా కరుణరత్నే, జెఫ్రీ వాండర్సే

Advertisement

Next Story