యుద్ధం కొనసాగితే రూ. 56 వేలకు బంగారం ధర!

by Manoj |
యుద్ధం కొనసాగితే రూ. 56 వేలకు బంగారం ధర!
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా పసిడి ధరలు ఎప్పటికప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఒకవేళ మరో రెండు-మూడు నెలల పాటు యుద్ధం కొనసాగితే బంగారం రికార్డు స్థాయిలో పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 2,100 డాల‌ర్ల‌కు, దేశీయంగా రూ.56,000 మార్కును దాటేయచ్చని బులియ‌న్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

పసిడి గడిచిన మూడు నెలల్లో సుమారు రూ. 3,500 పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో 24 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ. 48,270 ఉండగా, గత వారాంతంలో ఇది రూ. 52,800కి చేరుకుంది. కేవలం గత వారం రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ. 1,000 వరకు పెరిగింది. రాబోయే 2-3 నెలల కాలంలో అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా ఉంటే 10 గ్రాముల బంగారం రూ. 56 వేలను దాటేస్తుందని నిపుణులు వివరించారు. పసిడి బాటలోనే వెండి కూడా పరిస్థితుల ప్రభావం వల్ల రానున్న రోజుల్లో కిలో రూ. 85 వేల వరకు చేరుకోవచ్చని అంచనా. ప్రస్తుతానికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 52,800 ఉండగా, ఆభరణాల వినియోగంలో వాడే 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ. 48,400గా ఉంది. వెండి కిలో రూ. 73,400గా ఉంది.

Advertisement

Next Story