- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరివికాస్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి: అరుణ
by S Gopi |
X
దిశ, బొంరాస్ పేట్: మండలంలోని గిరిజన రైతులు గిరి వికాసం పథకంను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ అరుణ దేశు, ఎంపీపీ హెమిబాయి అన్నారు. ఈ పథకం ద్వారా బోరు వేసుకొనుటకు అవకాశం కల్పించడం జరుగుతదని తెలిపారు. ఈ పథకంకు చిన్న, సన్నకారు ఎస్టీ రైతులకు కనీసం ఐదు ఎకరాల భూమి ఉండి, కనీసం 2-3సభ్యులు గ్రూపుగా ఉండాలని తెలిపారు. ఈ పథకం ద్వారా నీటి కొరత, నిరుపయోగంగా ఉన్న ఎస్టీ రైతుల వర్షాధార భూములకు నీటి సదుపాయం(సౌకర్యం) అందించడం ముఖ్య ఉద్దేశమని, బోర్ వెల్ డ్రిల్లింగ్, మోటర్ పంప్ సెట్ ను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆధార్ కార్డ్, కులము, ఆదాయము, గ్రామపంచాయతీ తీర్మానం, పట్టాదారు పాస్ బుక్, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, పాస్ ఫొటోస్ పత్రాలను జత చేసి మండల పరిషత్ కార్యాలయంలో సంప్రదించాలని ఎంపీడీవో పాండు నాయక్, ఏపీఓ మల్లికార్జున యాదవ్ తెలిపారు.
Advertisement
Next Story