స్కూటీని ఢీకొన్న జీ హెచ్ ఎం సి చెత్త లారీ.. వ్యక్తి మ‌ృతి

by Disha News Desk |
స్కూటీని ఢీకొన్న జీ హెచ్ ఎం సి చెత్త లారీ.. వ్యక్తి మ‌ృతి
X

దిశ, సికింద్రాబాద్: తార్నాక చౌరస్తా లోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్‌పెక్టర్ రమేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. చంగిచర్ల ప్రాంతానికి చెందిన కడప కోటేశ్వర్ (55) వృత్తి రీత్యా టైలర్ పని చేసుకుంటాడు. సోమవారం సికింద్రాబాద్ నుండి ఉప్పల్ వెళ్తుండగా, వెనకాలే వస్తున్న జీ.హెచ్.ఎం.సి చెత్త లారీ లాలపేట్ వైపు వెళ్లే క్రమంలో తార్నాక చౌరస్తాలో లారీ స్కూటీని ఢీకొనడంతో కోటేశ్వర్ స్పాట్‌లోనే మృతి చెందాడు.

మృతున్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తలకు హెల్మెట్ ధరించలేని కారణంగానే స్పాట్‌లో మృతి చెందాడని, హెల్మెట్ ధరించి ఉంటే ప్రమాదం కొంత మేర తప్పెదని ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేదని సీఐ రమేష్ నాయక్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed