- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pelican Signals: హైదరాబాద్‌లో 68 పెలికాన్ సిగ్నల్స్.. అబ్బురపరుస్తున్న నయా టెక్నాలజీ
దిశ, డైనమిక్ బ్యూరో: GHMC Sets up 68 Pelican Traffic Signals in Hyderabad| నగరంలో రోజురోజుకి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. రోడ్డు క్రాస్ చేయడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్ వద్ద ఉండే ప్రధాన కూడళ్లలో 68 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కూడిన పెలికాన్ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేసింది. విదేశీ నగరాల తరహాలో ఈ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెలికాన్ సిగ్నల్స్ మాన్యువల్‌గా కంట్రోల్ చేస్తాయి. ఇవి బటన్‌ను నొక్కినప్పుడు రోడ్డు దాటేవారికి 15 సెకన్ల విండో ఓపెన్ చేస్తాయి. ఈ క్రమంలో రెడ్ సిగ్నల్ పడి రోడ్డు దాటేవారికి సురక్షితంగా ఉంటుంది. నగరంలో ఈ 68 సిగ్నల్స్‌తో పాటు మరో 26 పెలికాన్ సిగ్నల్స్‌ను పోలీసు శాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే ఏర్పాటు చేసేందుకు పౌరసరఫరాల శాఖ యోచిస్తోంది.
- Tags
- Pelican Signals