- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గెట్ రెడీ గాయ్స్.. థియేటర్లు దద్దరల్లించడానికి రెడీ అంటున్న పుష్ప2.. హైప్ పెంచేస్తోన్న ట్వీట్
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘పుష్ప 2’(Pushpa 2). ఈ సినిమా ‘పుష్ప’(Pushpa) మూవీకి సీక్వెల్‌గా వస్తోంది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది.
‘పుష్ప 2’ లో యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree leela) ఐటెమ్ సాంగ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇందులో భాగంగా టాలెంటెడ్ డ్యాన్స్‌ర్ అయిన శ్రీలీలకి స్వాగతం.. ఇద్దరు డ్యాన్సర్లు వేదికపై నిప్పులు చెరుగేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ ట్వీట్ చేసింది. అలాగే ఈ పాటకు సంబంధించిన షూట్ నవంబర్ 6న స్టార్ట్ కానున్నట్లు కూడా తెలియజేశారు. కాగా దీనికి గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ అందించనున్నారు. అంతేకాకుండా సినిమా చూపిస్తా మావా అనే సాంగ్‌కు అల్లు అర్జున్, శ్రీలీలను ఎత్తుకొని డ్యాన్స్ చేస్తున్న క్లిప్‌ను యాడ్ చేస్తూ తగ్గేదేలే అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక ఇద్దరు టాలెంటెడ్ డ్యాన్సర్లను ఓకే సారి తెరపై చూస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయి అని అంటున్నారు ఫ్యాన్స్.