టీఆర్ఎస్‌లో కలకలం.. షర్మిలను ఆమె ఎందుకు కలిసింది..?

by Nagaya |
టీఆర్ఎస్‌లో కలకలం.. షర్మిలను ఆమె ఎందుకు కలిసింది..?
X

దిశ, గార్ల : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ జాటోతు ఝాన్సీ బాయ్ వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిలను ఆదివారం కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర మండలానికి రాగా.. గట్టు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఝాన్సీ బాయ్ షర్మిలను కలిశారు. కాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ షర్మిలతో భేటీ కావడం పట్ల ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గార్లలో అధికార పార్టీలో వర్గపోరుతో పార్టీ శ్రేణులు సతమతమవుతున్నారు. జడ్పీటీసీ త్వరలోనే పార్టీనీ వీడి షర్మిల పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె షర్మిలను ఎందుకు కలిసిందో ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.

Advertisement

Next Story