- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గణేష్ మాస్టర్‌పై సెక్సువల్ హరాస్‌మెంట్.. కేసులో కీలక మలుపు
దిశ, సినిమా : బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై ముంబై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2020లో కో-డ్యాన్సర్‌ను లైంగిక వేధించినట్లు అతడు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ కేసును విచారించిన అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.. ఇటీవలే ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు ఓషివారా పోలీస్ ఆఫీసర్ సందీప్ షిండే తెలిపారు. ఈ మేరకు గణేష్ ఆచార్య, అతని సహాయకుడిపై 354-ఎ , 354-సి, 354-డి, 509, 323, 504, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ అప్‌డేట్‌పై స్పందించేందుకు గణేష్ ఆచార్య నిరాకరించారు. ఈ ఆరోపణలను గతంలోనూ ఖండించిన ఆచార్య.. వాటిని తప్పుడు కేసులుగా అభివర్ణించిన సంగతి తెలిసిందే.
కాగా ఆచార్య లైంగిక చర్యలను తిరస్కరించిన తర్వాతే తనను వేధిస్తున్నాడని ఉమన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తన ఫిర్యాదులో పేర్కొంది. అసభ్యకరమైన వ్యాఖ్యలతో పాటు పోర్న్ సినిమాలు చూపించి హింసించేవాడని ఆరోపించింది. ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే.. అతనితో లైంగిక సంబంధం పెట్టుకోవాలంటూ మే 2019లో ఒత్తిడి చేశాడని తెలిపింది. అందుకు నిరాకరించడంతో ఆర్నెళ్ల తర్వాత ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ తన సభ్యత్వాన్ని రద్దుచేసినట్లు చెప్పుకొచ్చింది. 2020లో జరిగిన మీటింగ్‌లో ఆచార్య చర్యలను వ్యతిరేకించినపుడు అతని ఫిమేల్ అసిస్టెంట్స్ తనపై దాడి చేయడంతో లాయర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది.