Game Changer: గేమ్ ఛేంజర్ టీజర్ కొత్త రికార్డ్.. 24 గంటల్లో ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయో తెలిస్తే షాకవ్వాల్సిందే!

by Prasanna |
Game Changer: గేమ్ ఛేంజర్ టీజర్ కొత్త  రికార్డ్.. 24 గంటల్లో ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయో తెలిస్తే షాకవ్వాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా నుంచి శనివారం టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. లక్నోలో ఒక ఈవెంట్ పెట్టి, చిత్ర బృందం మొత్తం అక్కడికి హాజరయ్యి గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. మూడేళ్ళుగా ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.

టీజర్ లో చరణ్ లుక్స్ సూపర్ , డైలాగ్స్ తో అందర్ని మెప్పించాడు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ టీజర్ ట్రెండింగ్ నెంబర్ 1లోనే ఉంది. ఇక మూడు భాషల్లో గేమ్ ఛేంజర్ టీజర్ 24 గంటల్లో 70 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి రికార్డ్ క్రియోట్ చేసింది.

చిత్ర బృందం గేమ్ ఛేంజర్ 24 గంటల వ్యూస్ ని పోస్టర్ తో షేర్ చేయడం వలన చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీజర్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది ఈ రోజు సాయంత్రం వరకు 100 మిలియన్ వ్యూస్ దాటేస్తుందని సినీ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story