- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ ఎంపీపీ.. అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన జనం..
దిశ, ఐజ : అనారోగ్యంతో కను మూసిన జోగులాంబ గద్వాల జిల్లా టీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ ఎంపీపీ తిరుమల్ రెడ్డి అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వగ్రామమైన చిత్తనూరులో జరిగాయి. ఆయన అంతిమయాత్రకు భారీగా జనం తరలివచ్చారు. బుధవారం హైదరాబాదులో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన అవయవాలను దానం చేసి.. అనంతరం పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంలో వారి సొంతూరుకు తీసుకొచ్చారు.
గురువారం సాయంత్రం నుండి, శుక్రవారం ఉదయం వరకు ప్రజల సందర్శనార్థం పార్థివ దేహాన్ని అందుబాటులో ఉంచారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్యేలు డాక్టర్ అబ్రహం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, అలంపూర్ మాజీ ఎమ్మెల్యేలు చల్లా వెంకట్రామిరెడ్డి, సంపత్ కుమార్, ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ తదితరులు హాజరై నివాళులర్పించారు. అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లా నుండే కాకుండా, పక్కన ఉన్న రాయలసీమ ప్రాంతం నుండి సైతం తిరుమల్ రెడ్డి శ్రేయోభిలాషులు, అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో అంతిమయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అడుగడుగునా ప్రజలు తిరుమల్ రెడ్డి యాత్ర సాగుతుండగా కన్నీటి పర్యంతం అయ్యారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత తిరుమల్ రెడ్డి చితికి ఆయన కుమారుడు గౌతంరెడ్డి నిప్పు అంటించిన తర్వాత అంత్యక్రియలు ముగిసాయి.