AP News: పోరస్ కంపెనీ బాధితులకు న్యాయం చేయాలి: చింతమనేని ప్రభాకర్

by samatah |   ( Updated:2022-04-15 10:20:06.0  )
AP News: పోరస్ కంపెనీ బాధితులకు న్యాయం చేయాలి: చింతమనేని ప్రభాకర్
X

దిశ, ఏపీ బ్యూరో : ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను కంపెనీ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకుని బాధితులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. అనంతరం విజయవాడ గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Next Story