- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ నేతలపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు.. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ నేతలపై దాడులు చేస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. దాడికి పాల్పడ్డ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తూ డీజీపీ కార్యాలయంలో గురువారం ఆయన ఫిర్యాదు చేశారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. బీజేపీ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేయడమే కాకుండా దాడులు చేసిన వారిని వదిలేసి బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. మొన్న సిరిసిల్లలో, నిన్న బోధన్ లో తమ పార్టీ నాయకులపై హత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా న్యాయవాదిపై కోర్టులోనే దాడి చేసిన ఇంతవరకు నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయలేదని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ నేతలు పోలీసులను చెప్పుచేతల్లో ఉంచుకుని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బెంగాల్ గా తెలంగాణను మార్చవద్దని ఆయన సూచించారు. తమ నేతల పై దాడులకు దిగితే కేంద్ర హోంశాఖ సాయంతో ముందుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. బీజేపీ నేతలపై దాడులకు దిగిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు.