- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫర్ ది ఫస్ట్ టైమ్ ఆ స్టార్ హీరోకు తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్..?
దిశ, సినిమా: 'అర్జున్ రెడ్డి' సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ అందరికీ సుపరిచితమే. ఇక రణ్‌బిర్ కపూర్‌తో 'యానిమల్' సినిమా తీసి పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎదిగిపోయాడు. ఈ సినిమా ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమాను ప్రకటించాడు సందీప్ రెడ్డి వంగ. అలాగే ఈ మూవీలో డార్లింగ్‌ను ఫస్ట్ టైమ్ పోలీస్ యూనిఫాంలో చూపించబోతున్నానంటూ ఫస్ట్ అప్డేట్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశాడు. అలాగే రెబల్ స్టార్ ఇందులో రూత్‌లెస్ వైల్డ్ పోలీస్‌గా చూపించబోతున్నాయని కూడా సందీప్ అన్నాడు.
ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త వైరల్‌గా మారింది. ఈ సినిమాల్లో ప్రభాస్‌కు జంటగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించబోతుందట. దాదాపు 17 సంవత్సరాల క్రితం ప్రభాస్ హీరోగా వచ్చిన ‘యోగి’ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. మళ్లీ ఈ కాంబో రిపీట్ అవ్వలేదు. ఇన్నేళ్లకు మళ్ళీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్ కూడా వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఓ కీలకమైన గెస్ట్ రోల్‌లో, అది కూడా ప్రభాస్‌కు తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని టాలీవుడ్ సర్కిల్లో ఒక కేజీ వార్త వైరల్‌గా మారింది. దీంతో ప్రభాస్ సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ విషయం పై ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో అదిరిపోయే డిస్కషన్లు జరుగుతున్నాయట. గతంలో ఎన్నో సందర్భాల్లో తాను చిరంజీవి అభిమాని అని చెప్పిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మెగాస్టార్ కోసం ఎలాంటి గెస్ట్ రోల్ డిజైన్ చేశారు అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారింది.