బీఈడీ, డీఈడీ ఫైనలియర్​ విద్యార్థులకు.. 'టెట్'​కు ఛాన్స్

by Vinod kumar |
బీఈడీ, డీఈడీ ఫైనలియర్​ విద్యార్థులకు.. టెట్​కు ఛాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఈడీ, డీఈడీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు కూడా టెట్​రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు టెట్​ఎక్స్​అఫీషియో డైరెక్టర్​రాధా రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే వారు ఈ ప్రవేశ పరీక్షలో క్వాలిఫై అయినా కోర్సు పూర్తి చేశాకే ఉద్యోగానికి అర్హత సాధించినట్లు అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా టెట్​దరఖాస్తులను శనివారం నుంచి స్వీకరించనున్నారు. ఏప్రిల్ 12వ తేదీ వ‌ర‌కు దరఖాస్తులు తీసుకోనున్నారు. దరఖాస్తు రుసుముగా రూ.300 చెల్లించాల్సి ఉంది. 2017 టెట్ సిల‌బ‌స్ ప్రకార‌మే ఈ సారి ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు.


హెల్ప్ డెస్క్ సేవ‌లు మార్చి 26 నుంచి జూన్ 12వ తేదీ వ‌ర‌కు అందుబాటులోకి రానున్నాయి. కాగా పరీక్షను జూన్​12న నిర్వహించనున్నారు. ఉదయం ఒక పేపర్, మధ్యాహ్నం ఒక పేపర్​చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్​ కు రెండున్నర గంటల సమయం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూన్ 6వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్​లోడ్​చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 12న పరీక్స ఉండగా అదేనెల 27వ తేదీన ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్నారు. ఇతర వివరాలకు tstet.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లో సంప్రదించాలని రాధారెడ్డి విజ్ఞప్తిచేశారు.

Advertisement

Next Story

Most Viewed